: జైల్లో రాజయ్య తొలి రోజు ఎలా గడిచిందంటే..!


నిత్యమూ ఇంటికి వచ్చి పోయే కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతూ, వారికి సలహాలు, సూచనలు ఇస్తూ బిజీగా గడిపే కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య, నిన్న వరంగల్ లోని జైలులో నాలుగు గోడల మధ్య కాలం గడిపారు. ఉదయాన్నే 5:30 గంటలకే జైలు సిబ్బంది ఆయన్ను నిద్రలేపారు. కాలకృత్యాల అనంతరం 7 గంటలకు ఆయన టమాటా బాత్ తిన్నారని, ఆపై కాసేపు దినపత్రికలు తిరగేసి, కొంతసేపు నిద్రపోయారని జైలు అధికారి ఒకరు తెలిపారు. మధ్యాహ్నం, సాయంత్రం సాధారణ భోజనం చేశారని వివరించారు. ములాఖత్ కోసం రాజయ్య మిత్రుడు వెంకయ్య వచ్చి వెళ్లారని, ఓ కాంగ్రెస్ నేతవచ్చి రాజయ్యకు లుంగీ, డ్రస్, ఆయన కొడుకుకు నైట్ ప్యాంట్, భార్యకు రెండు చీరలు, అరటి పండ్లు ఇచ్చి వెళ్లారని వివరించారు. కాగా, తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని జైలు అధికారులను రాజయ్య కోరగా, అందుకు కోర్టు అనుమతి రావాలని సిబ్బంది చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News