: నేను అనుభవించిన గృహ హింసను మీతో పంచుకోవాలని ఉంది: హాలీవుడ్ బ్యూటీ హాలీబెర్రీ
ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎంతో గృహహింసను అనుభవిస్తున్నారని, అటువంటి వారిలో తానూ ఒకదాన్నని ప్రముఖ హాలీవుడ్ నటి హాలీబెర్రీ వ్యాఖ్యానించింది. తాను అనుభవించిన హింసను అందరికీ చెప్పుకోవాలని ఉందని అంటోందీ ఆస్కార్ అవార్డు విజేత. తన తల్లి గృహహింసకు గురికావడాన్ని స్వయంగా చూశానని, తాను సహజీవనం చేస్తున్నప్పుడు కూడా అదే తరహా అనుభవం ఎదురైందని చెప్పింది. తన చిన్ననాటి ఘటనలు ఎన్నో వెంటాడుతున్నాయని, ఆ సమయంలో తాను నిస్సహాయురాలినని, పెరిగి పెద్దయ్యాక, అటువంటి హింసనే ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది. జీవిత భాగస్వాములను హింసించే వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సహనంగా ఉండరాదని హాలీ బెర్రీ సలహా ఇచ్చింది.