: మా గురించి మీకెందుకు?... ఇండియాపై విరుచుకుపడ్డ నేపాల్


నేపాల్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఇండియా ప్రస్తావించడాన్ని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ తప్పుబట్టారు. నేపాల్ లో శాంతిని నెలకొల్పేందుకు యూఎన్ చేస్తున్న ప్రయత్నాలను ఇండియా విస్మరించిందని శర్మ విమర్శించారు. తమ దేశం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. "కొద్ది రోజుల క్రితం మా పొరుగు దేశపు నేత ఒకరు నేపాల్ పై తమ శక్తిని ప్రదర్శిస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు" అని ఎవరి పేర్లనూ వెల్లడించకుండా వ్యాఖ్యానించిన ఆయన, దశాబ్దపు కాలం నాటి ఓ పాత విషయాన్ని ఇండియా తవ్వుతోందని దుయ్యబట్టారు. గతంలో తమ దేశం యుద్ధం చేసిందని, అన్ని సమయాల్లో అది పనికిరాదని, ఇప్పుడు తాము శాంతి మార్గంలో వెళుతున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News