: తెలంగాణలో పని చేస్తుంటే, జీతాలు మేమివ్వాలా?: కోర్టుకెక్కిన చంద్రబాబు సర్కారు


తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలను తామెందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తూ, ఆంధ్రప్రదేశ్ సర్కారు హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 1,253 మంది ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తుంటే, వారికి ఇచ్చే వేతనంలో 58 శాతం ఏపీ సర్కారు భరించాలని గతంలో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ, చంద్రబాబు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకే కోర్టులో పిటిషన్ వేసినట్టు ఏపీ విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ పక్కన బెట్టగా, వారు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, వీరిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని వేతనాలను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News