: 'డబ్బుల్' బాదుడు... మారిన రైల్వే టికెట్ నిబంధనలు ఇవే!


రైల్వే టికెట్ బుక్ చేసి, ఆపై రద్దు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ జేబు నుంచి రద్దు చార్జీల పేరిట రెట్టింపు మొత్తాన్ని లాగేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రిఫండింగ్ చార్జీలను 100 శాతం పెంచుతున్నామని, కొత్త చార్జీలు 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే శాఖ ఉన్నతాధికారి తెలిపారు. అంతేకాదు, ట్రైన్ బయలుదేరిన తరువాత టికెట్ రద్దుకు అవకాశం ఉండదు. కనీసం 4 గంటల ముందుగా మాత్రమే టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాలి. అప్పుడు కూడా మొత్తం సొమ్ములో 50 శాతం మాత్రమే వెనక్కు వస్తుంది. ఆ తరువాత రద్దు చేసుకున్నా ఎటువంటి మొత్తమూ వెనక్కు రాదు. ఇక బుకింగ్ కౌంటర్లో టికెట్ రద్దు చేసుకోవాలంటే ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ. 30 రీఫండింగ్ చార్జీని రూ. 60కి పెంచారు. ఇక 48 గంటల ముందు ఫస్ట్ ఏసీ టికెట్ రద్దు చార్జీని రూ. 120 నుంచి రూ. 240కి, సెకండ్ ఏసీ చార్జీ టికెట్ రద్దు చార్జీ రూ. 100 నుంచి రూ. 200కి, థర్డ్ ఏసీ టికెట్ రద్దుకు రూ. 90 నుంచి రూ. 180కి పెరుగగా, స్లీపర్ క్లాస్ పై రూ. 60 నుంచి రూ. 120కి, సెకండ్ క్లాస్ సిటింగ్ టికెట్ రద్దుపై చార్జీ రూ. 30 నుంచి రూ. 60కి పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఈ-టికెట్లు వెయిటింగ్ లిస్టులో ఉండి, కన్ఫర్మ్ కాకుంటే, వాటంతట అవే రద్దయిపోతాయి.

  • Loading...

More Telugu News