: సారిక మరణానికి నిమిషాల ముందు ఏం జరిగిందంటే...!


మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల సజీవ దహనానికి ముందు అర్ధరాత్రి దాకా వాళ్లింట్లో జరిగిన గొడవ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన రాజయ్య, ఎన్నికల ఖర్చు కోసం రఘునాథ్ పల్లి మండలంలోని వ్యవసాయ భూమిని విక్రయించాలని నిర్ణయించారు. దీనిపై ఇంట్లో చర్చ జరుగగా, తన పిల్లల భవిష్యత్తుపై ప్రశ్నించిన సారిక, ఎటువంటి భరోసా ఇవ్వకుండా భూమిని అమ్మేందుకు సిద్ధపడితే, సంతకం పెట్టబోనని స్పష్టం చేశారు. దీనిపై రాజయ్య స్పందిస్తూ, రెవెన్యూ కాలనీలో ఉన్న ఇంటిని ఇస్తామని, వ్యవసాయ భూమి విషయంలో జోక్యం వద్దని నచ్చజెబుతుండగా, అత్త, ఇతర కుటుంబ సభ్యులు సారికతో గొడవకు దిగి ఎలాంటి ఆస్తి ఇవ్వబోమని వాదనకు దిగారు. రాత్రి ఒంటి గంట వరకూ వారి వాగ్వాదం, కేకలు ఇరుగుపొరుగు వారికి వినిపిస్తూనే ఉన్నాయి. అందరూ నిద్రించిన తరువాత కాసేపటికే అగ్ని ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News