: తెలంగాణ ఆర్టీసీకి రోజుకి కోటి నష్టం వస్తోంది: మహేందర్ రెడ్డి
తెలంగాణ ఆర్టీసీకి రోజుకి కోటి రూపాయల నష్టం వస్తోందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో 1300 గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేదని అన్నారు. అందుకే 150 కోట్ల రూపాయలతో 500 బస్సులు కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇందులో 100 ఏసీ బస్సులు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ బస్సులను పుణ్యక్షేత్రాలు, జిల్లా కేంద్రాలకు నడిపిస్తామని ఆయన చెప్పారు. వీటి ద్వారా ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని లాభాల బాటపట్టిస్తామని ఆయన తెలిపారు.