: గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాను: మంత్రి కేటీఆర్


గల్ఫ్ లో ఇబ్బందిపడుతున్న తెలంగాణ వాసులను ఆదుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖాధికారులను కోరినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన సంబంధిత ఉన్నతాధికారులను కలిశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, గల్ఫ్ బాధితుల కష్టాలను కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లామని, ఇక్కడి నుంచి వేల సంఖ్యలో అక్కడికి వెళ్లిన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్పష్టంగా వివరించి చెప్పామని అన్నారు. కేవలం గల్ఫ్ లోనే కాకుండా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల వివరాలను సేకరించాలని కోరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రాలతో విదేశీ మంత్రిత్వ శాఖ వర్కింగ్ గ్రూప్ ను ఒక దానిని ఏర్పాటు చేయాలని సూచించినట్లు కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పెద్దూరుకు చెందిన ఐదుగురు కార్మికులు ఎదుర్కొంటున్న శిక్ష విషయాన్ని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ వద్ద ప్రస్తావించారు. కాగా, ఈ సమావేశంలో ఎంపీ వినోద్, రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News