: మాల్దీవుల అధ్యక్షుడ్ని 30 రోజుల్లో లేపేస్తామంటూ వీడియో!


మాల్దీవుల అధ్యక్షుడ్ని 30 రోజుల్లో అంతం చేస్తామంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో అప్రమత్తమైన ఆ దేశ భద్రతా దళాలు దర్యాప్తు చేసి దానిని పోస్ట్ చేసిన 'సాంగు టీవీ' అనే టీవీ ఛానెల్ పై సోదాలు నిర్వహించాయి. సంస్థ ఉద్యోగుల్లో ఎవరో ఆ వీడియోను పోస్టు ఉంటారని, ఉగ్రవాద కార్యకాలపాలకు పాల్పడుతున్నారంటూ ఈ సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 27 హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై 'సాంగు టీవీ' ఛానెల్ యాజమాన్యం మాట్లాడుతూ, ఆ వీడియోను తాము అప్ లోడ్ చేయలేదని, అనవసరంగా తమ చానెల్ పై బలగాలు దాడులు నిర్వహించి ప్రసారాలు ఆపేయించాయని మండిపడ్డారు. కాగా, ఆ వీడియోలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని, ఈ మేరకు చేసిన చట్టాన్ని కూడా రద్దుచేయాలని, లేని పక్షంలో నెల రోజుల్లో అధ్యక్షుడు, టూరిజం శాఖ మంత్రులను అంతం చేస్తామని, మాల్దీవుల్లో తీవ్రవాదంతో రక్తపుటేరులు పారిస్తామని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం అనుమతితో దర్యాప్తు ప్రారంభించగా స్లావరీ స్లేవ్ పేరుతో ఐసిస్ సంకేతంతో పోస్టు చేశారని, సాంగు టీవీ పేరిట యూట్యూబ్ లో అప్ లోడ్ అయిందని భద్రతా బలగాలు తెలిపాయి. కాగా, ఈ మధ్యే మాల్దీవుల్లో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News