: చిరంజీవి ఆదర్శం...నాన్న, అన్నతో కలసి చేయాలనుంది: అఖిల్ అక్కినేని
అభిమానుల నుంచి అఖిల్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాడు. వివిధ ప్రశ్నలతో అభిమానులు అఖిల్ ను ఉక్కిరబిక్కిరి చేశారు. 'అఖిల్ సినిమా ఎలా ఉంటుంద'ని అడిగిన అభిమానికి 'సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు అందర్నీ ఆకట్టుకుంటుంద'ని చెప్పాడు. 'సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నారంట కదా? ఆ అనుభవం ఎలా ఉంద'న్న ప్రశ్నకు సమాధానమిస్తూ 'ఈ సినిమా కోసం గుర్రపుస్వారీ నేర్చుకోలేదు. చిన్నతనంలోనే హైదరాబాదు హార్స్ క్లబ్ లో మెంబర్ ని, అప్పుడే విదేశాలకు వెళ్లి మరీ గుర్రపు స్వారీ నేర్చుకున్నా, నాకు ప్రత్యేక గుర్రం కూడా ఉండేది'అని అఖిల్ చెప్పాడు. 'డాన్సుల్లో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటార'ని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు 'ఇంకెవరు, చిరంజీవి గారే...ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా' అంటూ సమాధానం చెప్పాడు అఖిల్. 'మల్టీస్టారర్ తీస్తే ఎవరితో నటించాలనుంది?' అని అడిగిన ప్రశ్నకు తన 'తండ్రి నాగార్జున, అన్నయ్య నాగచైతన్యతో నటించాల'ని ఉందని అఖిల్ చెప్పాడు.