: 'గ్రీన్ పీస్ ఇండియా' గుర్తింపు రద్దు చేసిన తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్
గ్రీన్ పీస్ ఇండియా గుర్తింపును తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ రద్దు చేసింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఓ స్వచ్ఛంద సంస్థ అయిన గ్రీన్ పీస్, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని, సహజ వనరులను విస్తృతంగా వినియోగించడాన్ని నిరోధించాలని కోరుతూ ప్రచారం చేస్తోంది. అయితే తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ చట్టం ప్రకారం గ్రీన్ పీస్ ఎన్జీవో ఆర్గనైజేషన్ గా గుర్తింపు పొందింది. తాజాగా దానిని రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్యను వ్యతిరేకించిన సదరు ఎన్జీవో గుర్తింపు రద్దు చేయడాన్ని ఖండించింది. ఇలా చేయడమంటే వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేయడమేనని పేర్కొంది.