: అధికారం రాలేదనే అక్కసుతోనే విద్వేషాలు: ప్రత్తిపాటి
వైకాపా నేతల వ్యవహారశైలిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తప్పుబట్టారు. అధికారంలోకి రాలేదన్న అక్కసుతోనే వైకాపా నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రైతుల శ్రేయస్సు కోసం టీడీపీ ప్రభుత్వం అలుపెరుగని కృషి చేస్తోందని చెప్పారు. పంటలకు మద్దతు ధర కల్పించిన ఘనత తమదే అని అన్నారు. రబీలో పంటల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని... విత్తనాలను సబ్సిడీకి అందిస్తామని చెప్పారు. ఈ నెల 11, 12 తేదీల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.