: రికార్డు పుటల్లో అశ్విన్
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొతం చేసుకున్నాడు. ఐదు వికెట్లను కూల్చిన క్రమంలో 150 వికెట్ల క్లబ్ లో చేరాడు. అంతకు ముందు భారత్ తరపున అనిల్ కుంబ్లే, ఎరాపల్లి ప్రసన్నలు 34 టెస్టుల్లో ఈ ఘనతను సాధించారు. అయితే ఈ ఘనతను సాధించడానికి అశ్విన్ కు కేవలం 29 టెస్టులే అవసరమయ్యాయి. మరోవైపు, భారత్ తరపున వేగంగా 100 వికెట్లు సాధించిన ఘనత కూడా అశ్విన్ పేరిటే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత స్పిన్నర్లైన షేన్ వార్న్ కు 150 వికెట్లు తీయడానికి 31 టెస్టులు అవసరమయితే, ముత్తయ్య మురళీధరన్ కు 36 టెస్టులు కావాల్సి వచ్చాయి.