: సుప్రీంకోర్టులో హార్దిక్ పటేల్ కు ఎదురుదెబ్బ... జనవరి 5 వరకు జైల్లోనే
పటేళ్ల రిజర్వేషన్ పోరాట నాయకుడు హార్దిక్ పటేల్ కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. అతనిపై నమోదైన రాజద్రోహం కేసును ఇవాళ విచారించిన కోర్టు వచ్చే ఏడాది జనవరి 5 వరకు రిమాండ్ విధించింది. అంతవరకు ఈ కేసులో హార్దిక్ పై విచారణ కొనసాగాల్సిందేనని ఆదేశించింది. అయితే ఈ కేసులో తదుపరి విచారణ జరిగే జనవరి 5 వరకు అతనిపై చార్జ్ షీట్ నమోదు చేయవద్దని గుజరాత్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ సందర్భంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో హార్దిక్ మాట్లాడుతూ, అవసరమైతే పోలీసులను చంపాలంటూ పిలుపునిచ్చాడు. దాంతో అతనిపై రాజద్రోహం కేసు నమోదైంది.