: సారిక కేసులో... అనిల్ రెండో భార్య సన కోసం పోలీసుల గాలింపు
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశం మొత్తం మీద సంచలనం సృష్టించిన రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవల అనుమానాస్పద మృతి కేసులో వరంగల్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సారిక భర్త అనిల్ రెండో భార్య సన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో హన్మకొండ నుంచి ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం హైదరాబాద్ చేరుకుంది. సన ఆచూకీ కోసం హైదరాబాద్ పోలీసుల సాయాన్ని తీసుకుంటున్నారు. మరోవైపు ఈ కేసులో ఆమెను నాలుగో నిందితురాలిగా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.