: అమరావతి శంకుస్థాపనపై మాజీ మంత్రి డీఎల్ విమర్శలు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శలు చేశారు. శంకుస్థాపన జరిగిన తీరు అసహ్యంగా ఉందని మీడియాతో వ్యాఖ్యానించారు. అనవసర ఆర్భాటానికి పోయి శంకుస్థాపన కార్యక్రమానికి వందల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని, ఆ అసంతృప్తి ప్రజల్లో ఉందని అన్నారు. అందుకే ప్రత్యేక రాయలసీమ సమావేశాన్ని తిరుపతిలో పెట్టారని డీఎల్ పేర్కొన్నారు. అమరావతిపై రాయలసీమలోనే కాదని ఉత్తరాంధ్రలో కూడా అసంతృప్తి ఉందని చెప్పారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఈ సందర్భంగా డీఎల్ స్పష్టం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పాలన సరిగా లేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News