: జగన్ నోరు మూయించాం: దేవినేని
పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వైకాపా అధినేత జగన్ విష ప్రచారం చేసినప్పటికీ... ఆ ప్రాజెక్టును పూర్తి చేసి జగన్ నోరు మూయించామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టును కూడా సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ. 3 వేల కోట్లను విడుదల చేసిందని అన్నారు. ఈ రోజు అనంతపురంలో నీటి పారుదల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.