: రాజయ్యకు, కుటుంబ సభ్యులకు ఖైదీ నంబర్లు కేటాయింపు
కోడలు సారిక, ముగ్గురు మనవల సజీవ దహనం కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన కుటుంబ సభ్యులకు వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు ఖైదీ నంబర్లు కేటాయించారు. రాజయ్యకు ఖైదీ నంబర్ 2971, కుమారుడు అనిల్ కు 2970 నంబర్ కేటాయించగా... రాజయ్య భార్య మాధవిని మహిళా కారాగారానికి తరలించి 7856 నంబర్ కేటాయించారు. హన్మకొండ నాలుగో అదనపు మున్సిఫ్ కోర్టు నిన్న(గురువారం) ఈ ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.