: చంద్రబాబు మోసం చేశారు: మంద కృష్ణ మాదిగ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో టీడీపీని గెలిపించింది, అంతకు ముందు తెలంగాణలో టీడీపీని నడిపించింది మాదిగలే అనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సూచించారు. అనుక్షణం టీడీపీ వెన్నంటి ఉన్న మాదిగలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.