: జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా బాధిస్తున్నాయి!: మత అసహనంపై మన్మోహన్ సింగ్
దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చల్లో ఒకటైన మత అసహనంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొలిసారి స్పందించారు. జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా బాధిస్తున్నాయని, తనతో పాటు జాతి యావత్తూ బాధపడుతోందని ఆయన అన్నారు. మేధావులను హత్య చేయడాన్ని ఎవరూ హర్షించబోరని వ్యాఖ్యానించిన ఆయన, అభిప్రాయ భేదాల అణచివేత ఇండియాకు అత్యంత ప్రమాదకరమని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. భారతీయులకు మతం వ్యక్తిగతమని వెల్లడించిన ఆయన, ఎవరి విశ్వాసాల్లోకీ వెళ్లే ప్రయత్నాలు చేయరాదని అన్నారు. కాగా, ముస్లిం మతస్తులపై దాడులు పెరిగిన నేపథ్యంలో పలువురు తమ అవార్డులను వెనక్కిచ్చి మోదీ సర్కారుపై ఒత్తిడిని పెంచుతున్న సంగతి తెలిసిందే.