: పనిలేనివారే రాయలసీమ హక్కుల పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు: మంత్రి కేఈ
రాయలసీమ హక్కుల పేరుతో ఉద్యమాలు చేస్తున్న వారిపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. పనిలేనివారే ఇలా ఉద్యమాలు చేస్తుంటారని, ప్రజలు వాటిని పట్టించుకోరని అన్నారు. సీమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని విశాఖలో చెప్పారు. సీమలో పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అంబుజ, జైన్ మెగా ఫుడ్ ఫ్యాక్టరీ, ట్రిపుల్ ఐటీ, డీఆర్ డిఏ, ఉర్దు వర్శిటీ ఇవన్నీ ఏర్పాటు చేసేందుకు సీఎం అనుమతించారని వివరించారు. ఇంతకంటే సీమ వాసులకు ఏం కావాలని కేఈ అడిగారు. సీమ అభివృద్ధికి ఒక్కొక్కటిగా సాధించుకుంటున్నామన్న మంత్రి, ఇక అసంతృప్తి అనేది లేదని స్పష్టం చేశారు. ఇక రెవెన్యూ శాఖలో అవినీతిని చాలా వరకు కట్టడి చేశామని తెలిపారు. తాను చూస్తున్న రెండు శాఖల్లోనూ అవినీతి పూర్తిగా తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నానని పేర్కొన్నారు.