: మొహాలీ టెస్ట్... మూడో వికెట్ కోల్పోయిన సౌత్ ఆఫ్రికా


మొహాలీ పిచ్ బౌలర్లకు అనూహ్యంగా స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా సఫారీ బౌలర్ల ధాటికి 201 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ కూడా తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేశారు. ఈ రోజు (రెండో రోజు) ఆట ప్రారంభమైన తర్వాత 85 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ ఎల్గర్ అశ్విన్ బౌలింగ్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోరు 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు. ఆమ్లా (39), డీవిలియర్స్ (6) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News