: న్యూఢిల్లీకి కదిలిన చంద్రబాబు... ఫుల్ బిజీ షెడ్యూల్ ఇదే!
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన వెళ్లాల్సిన విమానం కొద్దిసేపటి క్రితం టేకాఫ్ అయింది. కాగా, తన ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు చంద్రబాబు బిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెమినార్ లో పాల్గొనే ఆయన, మధ్యాహ్నం 12:45 గంటల నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఆపై భోజన విరామం తరువాత 2:15 గంటలకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడితో, 3 గంటలకు సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ - భారత పరిశ్రమల సమాఖ్య) డైరెక్టర్ జనరల్ తో సమావేశమై చర్చించనున్నారు. దాని తరువాత 3:30 గంటల నుంచి జనధన్ ఆధార్ మొబైల్ విజన్ సెమినార్ కు హాజరవుతారు. రాత్రి 7 గంటల తరువాత ఢిల్లీలో జరుగుతున్న తిరుమల శ్రీవెంకటేశ్వరుని వైభవోత్సవాల్లో పాల్గొననున్నారు.