: రాహుల్ గాంధీ మారారని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలి ప్రశంస


భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా రాహుల్ గాంధీ మారిపోయారని, గతంతో పోలిస్తే ఆయన తీరు, హావభావాల్లో ఎంతో మార్పు వచ్చిందని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు (నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ కూతురు), ఇటీవల సాహిత్య అకాడమీ బహుమతిని వెనక్కిచ్చేసిన నయనతారా సెహగల్ వ్యాఖ్యానించారు. గతంలో తాను రాహుల్ రాజకీయాల్లో ఉండాల్సిన వాడు కాదని భావించానని, మరో వృత్తిని స్వీకరించాలని కూడా కోరుకున్నానని, కానీ, ఇటీవల బీహార్ ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ మాట్లాడిన తీరు ఎంతో ఆకట్టుకుందని ఆమె అన్నారు. ఇప్పుడు రాహుల్ దేశ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారని, ఆయనలో కనిపించిన మార్పు సానుకూల పరిణామమని సెహగల్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News