: ఢిల్లీ నేలను ముద్దాడిన చోటా రాజన్!... దేశభక్తుడిగా 'కలర్' ఇచ్చేందుకు యత్నం


ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో 20 ఏళ్లకు పైగా పోరు సాగిస్తున్న తాను నిజంగా దేశభక్తుడినేనని మాఫియా డాన్ చోటా రాజన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నగరం సిడ్నీ నుంచి జింబాబ్వే వెళుతున్న క్రమంలో ఇంటర్ పోల్ ఉప్పందించగా అతడిని ఇండోనేసియా పోలీసులు బాలి ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అతడు అక్కడి మీడియాతో మాట్లాడిన సందర్భంగా తన దేశభక్తి వ్యాఖ్యలు చేశాడు. నిన్న సీబీఐ అధికారులు ప్రత్యేక విమానంలో చోటా రాజన్ ను ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీ విమానం ఎక్కేముందు బాలిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మాతృభూమికి వెళుతున్నందుకు సంతోషంగా ఉందని కూడా అతడు పేర్కొన్నాడు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగిన అతడు అక్కడి నేలను ముద్దాడాడు. తద్వారా తాను నిజంగా దేశభక్తుడినేనని కలరింగ్ ఇచ్చేందుకు అతడు చేసిన యత్నాన్ని పలు వార్తా చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి.

  • Loading...

More Telugu News