: టీవీ చానల్ 'స్టింగ్'కు అడ్డంగా దొరికిన కన్నడ మంత్రి భార్య
హాస్టళ్లకు నిత్యావసరాలు సరఫరా చేసే కాంట్రాక్టు తమకే ఇప్పించాలని కోరుతూ ఓ టీవీ చానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో కర్ణాటక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హెచ్.ఆంజనేయ సతీమణి విజయ అడ్డంగా దొరికిపోయారు. కమీషన్ రూపంలో ఆమె రూ. 7 లక్షలు తీసుకుంటున్న దృశ్యాలు ప్రసారం కాగానే, ఆంజనేయ మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మొత్తం ఘటన ఇప్పుడు కన్నడనాట కలకలం రేపింది. కాగా, దళితులమైన తమపై కావాలనే కుట్ర చేసి ఇరికించారని ఆంజనేయ ఆరోపించారు. కాగా, ఆంజనేయ పదవిలో ఉండటానికి అనర్హుడని, తక్షణం రాజీనామా చేయకుంటే, తాము పోరాటానికి దిగుతామని మాజీ సీఎం యడ్యూరప్ప హెచ్చరించారు.