: సిరిసిల్ల ‘రెండో’ కోడలు కూడా నిందితురాలేనా?... కూపీ లాగుతున్న పోలీసులు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాజయ్య సహా ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ కుమార్ (సారిక భర్త)లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో అనిల్ కుమార్ రెండో పెళ్లి చేసుకున్నట్లుగా భావిస్తున్న సన పేరునూ చేర్చారు. అంతేకాక ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. సారిక సజీవ దహనం కేసులో సనకు ప్రత్యక్ష పాత్ర ఉందన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత కాని ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశాలు లేవని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News