: ఐయామ్ హ్యాపీ...ఎట్టకేలకు మాతృభూమికి వెళుతున్నా: బాలిలో మీడియాతో చోటా రాజన్


భారత్ పంపితే తనకు ప్రాణ హాని ఉందని పేర్కొన్న మాఫియా డాన్ చోటా రాజన్ ఎట్టకేలకు భారత్ కు వచ్చేశాడు. సీబీఐ అధికారులు అతడిని నిన్న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. బాలి ఎయిర్ పోర్టులో విమానం ఎక్కబోయే ముందు అతడు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఐయామ్ హ్యాపీ. చాలా కాలం తర్వాత మాతృభూమికి వెళుతున్నా’’ అని అతడు వ్యాఖ్యానించాడు. అరెస్టైన సమయంలో తనకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణహాని ఉందని, వదిలేస్తే తాను జింబాబ్వే పారిపోతానని కూడా చోటా రాజన్ బాలి పోలీసులను వేడుకున్నాడు. అయితే భారత్ కు బయలుదేరే ముందు అతడు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News