: ఏపీ సీఎం కేసీఆర్!... నోరు జారి నాలిక్కరుచుకున్న నాస్కామ్ తెలంగాణ చీఫ్


స్టార్టప్ లకు కేరాఫ్ అడ్రెస్ గా మారనున్న ‘టీ హబ్’ ప్రారంభోత్సవం నిన్న వేడుకలా జరిగింది. భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూపు సంస్థల చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావులు టీ హబ్ ను ప్రారంభించారు. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాస్కామ్ తెలంగాణ రాష్ట్ర శాఖ చైర్మన్ మోహన్ రెడ్డి ప్రసగించిన సందర్భంగా అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆయన ఏపీ సీఎం అని సంబోధించారు. దీంతో అక్కడ కలకలం రేగింది. అయితే తప్పుగా సంబోధించిన విషయాన్ని గుర్తించిన మోహన్ రెడ్డి, వెంటనే తన వ్యాఖ్యను సరిచేసి తెలంగాణ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News