: భారత్ కు చోటా రాజన్... కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలో విచారణ


మాఫియా డాన్ చోటా రాజన్ ను సిబీఐ అధికారులు ఎట్టకేలకు దేశం తీసుకువచ్చారు. అతడి కోసం ఇండోనేసియా వెళ్లిన సీబీఐ అధికారులు అతగాడితో పాటు నిన్న రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. ఇండోనేసియా నగరం బాలి నుంచి ప్రత్యేక విమానంలో చోటా రాజన్ ను తీసుకువచ్చిన సీబీఐ అధికారులు అతడిని ఢిల్లీ జైలులోని ఓ ప్రత్యేక సెల్ లో ఉంచారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చోటా రాజన్ కు పోలీసులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను కల్పిస్తున్నారు. ప్రస్తుతం చోటా రాజన్ ఉంటున్న సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద కూడా పెద్ద సంఖ్యలో సాయుధ పోలీసులు పహారా కాస్తున్నారు. సెల్ లో ఉంచిన చోటా రాజన్ నుంచి పలు కీలక వివరాలు సేకరించే పనిని సీబీఐ అధికారులు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News