: నెట్టింట్లో రకుల్ ప్రీత్ వీడియో హల్ చల్
టాలీవుడ్ యువనటి రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తక్కువ కాలంలో రకుల్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది. సందీప్ కిషన్ నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది. తాజాగా ఈ అందాలతార సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. అందులో తాను బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. తనకు ఇలాంటి కఠినమైన శిక్షణ నచ్చుతుందని రకుల్ ప్రీత్ పేర్కొంది. ఈ వీడియో పెట్టిన నాలుగు గంటల్లోనే లక్షా 30 వేల మంది దీనిని చూశారంటే ఆమెకు ఉన్న ఆదరణ ఎంతో అర్థం చేసుకోవచ్చు.