: రోజ్ వాటర్ తో ఎన్ని ఉపయోగాలో తెలుసా!


నిత్య జీవితంలో రోజ్ వాటర్ ను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా చర్మానికి, జుట్టుకు ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. క్రమం తప్పకుండా వాడితే ఫలితాలు లభిస్తాయి. రోజ్ వాటర్ ద్వారా కలిగే ఆ ప్రయోజనాలు .... * చర్మం యొక్క పీహెచ్ బ్యాలెన్స్ ను సరిగ్గా ఉండేలా చూడటమే కాకుండా చర్మం జిడ్డుగా మారకుండా చూస్తుంది. * రోజ్ వాటర్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న కారణంగా గాయాలను, చిన్న చిన్న దెబ్బలను నయం చేయడానికి తోడ్పడుతుంది. * యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న కారణంగా చర్మ కణాలను శక్తిమంతం చేస్తుంది. స్కిన్ టిష్యూలను తిరిగి ఉత్పత్తి చేస్తుంది. * చుండ్రు నివారణకు ఎంతో ఉపకరిస్తుంది. కేశాల సంరక్షణలో దీని పాత్ర అమోఘం. * చర్మం ముడతలు పడకుండా, నునుపుగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. వయస్సు పైబడకుండా కూడా కాపాడుతుంది.

  • Loading...

More Telugu News