: కొరియన్లను అలరిస్తున్న లాంతర్ ఫెస్టివల్
కొరియన్లను లాంతర్ ఫెస్టివల్ అలరిస్తోంది. ప్రతి ఏటా దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో నవంబర్ మొదటి శుక్రవారం నుంచి రెండు వారాల పాటు జరిగే లాంతర్ ఫెస్టివల్ ఏర్పాట్లు కొరియా వాసులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది రేపటి నుంచి నవంబర్ 22 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా సియోల్ లోని చియాంగీ వీధినంతటినీ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. అలాగే లాంతర్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని పెద్ద పెద్ద లాంతర్లను ప్రదర్శనకు ఉంచుతారు. వీటిని చూసేందుకు సందర్శకులు ఉత్సాహం చూపుతారు. తాజాగా అక్కడి వీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కాంతుల్లో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.