: మహాకూటమిదే విజయం!: నితీష్ కుమార్


బీహార్ ప్రజలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. నేటితో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిపై బీహార్ ప్రజలు అవ్యాజమైన ప్రేమను కురిపించారని, అందుకు కృతజ్ఞతలని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహాకూటమే విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించిన జాతీయ ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల సిబ్బందిని ఆయన అభినందించారు. కాగా, 242 బీహార్ అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో నిర్వహించిన ఎన్నికలు నేటితో ముగిసాయి. నవంబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మహాకూటమి, బీజేపీ కూటమి మధ్య హోరాహోరీ తప్పదని చెబుతున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుందనే ఆసక్తి అందర్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో తాజా వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News