: ముగిసిన సారిక అంత్యక్రియలు... శ్మశానానికి తరలివచ్చిన ప్రజలు
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల అంత్యక్రియలు ముగిశాయి. స్థానిక పోతననగర్ లోని శ్మశాన వాటికలో సారిక తల్లి, బంధువులు ఈ అంత్యక్రియలు నిర్వహించారు. శ్మశాన వాటిక వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కాగా, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సారిక, కుమారులు ముగ్గురికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను ఆమె బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత గానీ సారికది హత్యా? ఆత్మహత్యా? అన్న విషయం బయటపడదు. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.