: ముగిసిన బీహార్ ఎన్నికలు... గెలుపు మాదే అంటున్న ఇరు వర్గాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలనకు మధ్య జరిగిన పోరాటంగా అభివర్ణింపబడ్డ బీహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. 243 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాన నేతల ప్రసంగాలు వేడి పుట్టించాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తుగడలతో బీహార్ అట్టుడికింది. యావత్ దేశం దృష్టిని ఈ ఎన్నికలు ఆకర్షించాయి. అయితే, ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఇరు వర్గాలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.