: విజయవాడలో సందడి చేసిన సినీ నటి శ్రీదేవి
సినీ నటి శ్రీదేవి విజయవాడలో సందడి చేసింది. బందర్ రోడ్డులోని ఓ జ్యువెలరీ షోరూంను ఆమె ప్రారంభించింది. ఈ సందర్భంగా నగరంతో తనకున్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకుంది. చాలా ఏళ్ల తరువాత విజయవాడ రావడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పింది. ఒకప్పుడు సినిమా షూటింగుల కోసం నగరానికి వచ్చేదాన్నని, ఆ విధంగా విజయవాడతో తనకెంతో అనుబంధం ఉందని తెలిపింది. అయితే మళ్లెప్పుడు నగరానికి వస్తారు? అన్న ప్రశ్నకు, తన కుమార్తె పెళ్లి సమయంలో బంగారం కొనుగోలు చేసేందుకు వస్తానని శ్రీదేవి నవ్వుతూ సమాధానం ఇచ్చింది. కాగా, ఆమెను దగ్గర నుంచి చూసేందుకు పలువురు అభిమానులు ఎగబడ్డారు.