: సల్మాన్ సినిమా కారణంగా మరోచిత్రం రిలీజ్ వాయిదా
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’తో పాటు 'యాంగ్రీ ఇండియన్ గాడెసెస్’ అనే చిత్రం కూడా ఈ నెల 12న విడుదల కావాల్సివుంది. అయితే, ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా వాయిదా వేశారు. దీనికి కారణం, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ప్రభావం ఆ చిత్రంపై పడుతుందని దర్శక, నిర్మాతలు భావించడమే! కాగా, దేశ వ్యాప్తంగా చాలా థియేటర్లలో ఈ సినిమానే రిలీజ్ చేయనున్నారు. అంతేకాకుండా, ప్రేక్షకుల దృష్టి సల్మాన్ చిత్రంపైనే ఉంటుంది. దీంతో 'యాంగ్రీ ఇండియన్ గాడెసెస్' చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చేస్తామని దర్శకుడు పాన్ నలినీ వెల్లడించారు.