: రాష్ట్రపతికి దగ్గర కావడమే ప్రధానిగా నాకు దక్కిన అతిపెద్ద ప్రయోజనం!: మోదీ


అపారమైన అనుభవం, మేధస్సును కలిగివున్న రాష్ట్రపతి తనలోనే ఓ విశ్వవిద్యాలయాన్ని నింపుకున్న వ్యక్తని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. ఆయన జీవితం నుంచి తాను ఎన్నో అలవరచుకున్నానని వివరించారు. రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న మూడు రోజుల సందర్శకుల సదస్సులో భాగంగా రెండో రోజు మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. "నన్ను ఎవరైనా ప్రధాని అయిన తరువాత పొందిన అతిపెద్ద ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తే, రాష్ట్రపతికి దగ్గరయ్యే అవకాశం లభించడమే అని చెప్పుకోవడంలో సందేహించను" అని మోదీ అన్నారు. తాను రాష్ట్రపతిని ఎప్పుడు కలిసినా ఏదో ఒక చర్చ తమ మధ్య జరుగుతుందని, దాన్నుంచి తన వ్యక్తిత్వ వికాసం కొంత మెరుగుపడుతుందని వివరించారు. దేశంలోని విశ్వవిద్యాలయాల, ఐఐటీల వైస్ చాన్స్ లర్లు రాష్ట్రపతితో ప్రత్యక్షంగా సమావేశమవ్వాలని సూచించారు. రాష్ట్రపతి దిశానిర్దేశంలో పనిచేస్తే, ఎవరైనా ఆకాశమే అవధులుగా ముందుకు దూసుకెళ్లవచ్చని మోదీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News