: ఆరేళ్ల తరువాత భారత్ 'చెత్త రికార్డు'!
అత్యంత పేలవమైన ప్రదర్శనతో కేవలం 201 పరుగులకే ఆలౌటైన వేళ, భారత క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును గుర్తుకు తెచ్చింది. ఓ టెస్టు మ్యాచ్ లో స్వదేశంలో తొలి ఇన్నింగ్స్ ఆడుతూ, మొదటి రోజే ఇండియా ఆలౌట్ కావడం గడచిన ఆరేళ్లలో ఇదే తొలిసారి. ఇంతకుముందు 2009లో ఓ మ్యాచ్ లో ఇండియా జట్టు ఇలానే తొలి రోజు చాప చుట్టేసింది. నేటి మ్యాచ్ లో చివరి మూడు వికెట్లు రెండు ఓవర్ల తేడాలో పడిపోవడం గమనార్హం. కాగా, తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాప్రికా నిలకడైన ఆటతో తొలి అడుగు వేసింది. దక్షిణాఫ్రికా జట్టు స్కోరు ప్రస్తుతం 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు.