: పాక్ జర్నలిస్టును చంపింది మేమే!: తాలిబన్ ప్రకటన
పాకిస్థాన్ హక్కుల కార్యకర్త, జర్నలిస్టు జమాన్ మసూద్ బైక్ పై వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి హతమార్చడంపై పాక్ ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటన చేసింది. ఆ ఘటన జరిగిన కొన్ని గంటలకు స్పందించి, మసూద్ ను తామే హత్య చేశామని తెలిపింది. అతడు పత్రికల్లో తమకు వ్యతిరేకంగా రచనలు చేయడం వల్లే హతమార్చామని వెల్లడించింది. అతనిలాగే చాలామంది జర్నలిస్టులు తమ టార్గెట్ లో ఉన్నట్టు పేర్కొంది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఊరుకునేది లేదని, చంపేస్తామని తాలిబన్ కమాండర్ కారి సైఫుల్లా స్పష్టం చేశాడు. అయితే తాలిబన్లు వ్యవహరించిన తీరుపై పాక్ హక్కుల సంస్థ తీవ్రంగా మండిపడింది. ఈ కేసు విషయంలో పాక్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, పారదర్శకతతో కూడిన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.