: ఆప్ నేత దాఖలు చేసిన పిటిషన్ లో మోదీకి ఊరట
ఎన్నికల్లో కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత నిషాంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఊరట లభించింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన గుజరాత్ హైకోర్ట్ గతంలో కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కొత్తగా దాఖలు చేసిన పిటిషన్ లో అంతగా మెప్పించే విషయాలేవీ లేవని, గతంలో పేర్కొన్న ఆరోపణలే ఉన్నాయని పేర్కొంది. అందుకే పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు తెలిపింది. 2014, ఏప్రిల్ 30న జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న మోదీ తరువాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో తాను ఓటు వినియోగించుకున్నట్టు సిరా గుర్తున్న వేలిని చూపారు. దాంతో పాటు పార్టీ కమలాన్ని కూడా చూపారు. ఈ క్రమంలోనే ఆప్ నేత కోర్టులో పిటిషన్ వేశారు.