: 200 దాటిన ఇండియా స్కోరు
స్టార్ బ్యాట్స్ మన్లు రాణించలేకపోయిన వేళ, టెయిలెండర్లు కాస్తంత కుదురుగా ఆడటంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది. టీ విరామానికి ముందు జడేజా, అశ్విన్ లు ఓ గంట పాటు దక్షిణాఫ్రికా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. నిదానంగా ఆడుతూ, చెత్త బంతులను మాత్రమే తాకేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో 92 బంతులాడి 4 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసిన జడేజా, ఫిలాండర్ బౌలింగ్ లో ఎల్బీ రూపంలో వెనుదిరగడంతో భారత్ 8వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం అశ్విన్ 20 (40 బంతుల్లో), ఉమేష్ యాదవ్ 5 (4 బంతుల్లో) ఆడుతున్నారు. భారత స్కోరు 67 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు.