: తెలుగుదేశం పార్టీలోని కాపులకు న్యాయం జరిగింది: టీటీడీ ఛైర్మన్ చదలవాడ


తెలుగుదేశం పార్టీలోని కాపులకు న్యాయం జరిగిందని టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. టీడీపీ వల్లే తనకు ఛైర్మన్ పదవి దక్కిందని చెప్పారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందునే కాపు కార్పొరేషన్ కు రూ.వంద కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాపు కార్పొరేషన్ కు మరిన్ని నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నానన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను ఇవాళ ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చదలవాడ మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సూచన మేరకే ఢిల్లీలో వెంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో వైభవోత్సవాలు నిర్వహించాలని ఆలోచిస్తున్నామన్నారు. ఇక కురుక్షేత్రలో ఆలయ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2016 ఏప్రిల్ నాటికి ఆలయాన్ని ప్రారంభిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News