: వరంగల్ పాత నగర్ శ్మశానవాటికలో సారిక అంత్యక్రియలు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనవళ్లు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. వీరి మృతదేహాలకు వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రస్తుతం సారిక, ఆమె ముగ్గురు కుమారులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వరంగల్ లోని పాతనగర్ శ్మశానవాటికలో ఆమె బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, వీరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వరంగల్ లయన్స్ క్లబ్ కూడా ముందుకొచ్చింది.

  • Loading...

More Telugu News