: పోయినవారు పోగా, మిగిలిన టెయిలెండర్లు ఎంత సేపు లాగేనో!


మొహాలీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మురళీ విజయ్ చేసిన 75 పరుగులు, పుజారా 31 పరుగులు మినహా మిగతా పేరున్న బ్యాట్స్ మెన్ లు అంతా స్వల్ప స్కోరుకే పెవీలియన్ దారి పట్టడంతో, భారత స్కోరు కనీసం 200 పరుగులు దాటుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఓపెనర్ ధావన్ 0, కెప్టెన్ కోహ్లీ 1, కీపర్ వృద్ధిమాన్ సాహా 0, రహానే 15, మిశ్రా 6 పరుగులకు పెవీలియన్ దారి పట్టగా, ప్రస్తుతం జడేజా 17, ఆశ్విన్ 0 పరుగులతో ఆడుతున్నారు. జడేజా మినహా మిగిలిన వారంతా బౌలర్లే కావడంతో వారెంత సేపు దక్షిణాఫ్రికా బౌలర్లను అడ్డుకుంటారన్న ప్రశ్న నెలకొంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎల్గర్ 4 వికెట్లు పడగొట్టగా, ఫిరాండర్, హార్మర్, రబడాలకు తలో వికెట్ లభించింది. ప్రస్తుతం భారత స్కోరు 51 ఓవర్లలో 154/7.

  • Loading...

More Telugu News