: సారిక, పిల్లలకు ఆహారంలో మత్తు మందు... శాంపిళ్లను సేకరించిన పోలీసులు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవల సజీవ దహనం కేసులో కొత్త సంగతులు తెరపైకి వస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున వరంగల్ లోని రాజయ్య ఇంటిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఆయన కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో కలిసి సజీవ దహనమైంది. ఆత్మహత్య కోణంలో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు నేటి ఉదయం దాకా పెద్దగా పురోగతి సాధించలేదు. అయితే నేటి ఉదయం నుంచి పలు కీలక పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. సారిక భర్త అనిల్ రెండో భార్య సనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఈ క్రమంలో రాజయ్య ఇంటికి మరోమారు వెళ్లిన పోలీసులు మంగళవారం రాత్రి సారిక, ఆమె పిల్లలు తీసుకున్న ఆహారం శాంపిళ్లను సేకరించారు. మత్తు మందు కలిపిన ఆహారం తిన్న నేపథ్యంలో సారిక, ఆమె ముగ్గురు పిల్లలు మత్తులో పడిపోగా, ఆ తర్వాత వారికి నిప్పు పెట్టి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజయ్య కుటుంబ సభ్యులు, సనలను పలు కోణాల్లో విచారించిన తర్వాతే పోలీసులు ఆహారం శాంపిళ్లు సేకరించడంతో ఈ కేసు దర్యాప్తులో దాదాపుగా చిక్కుముడులు వీడినట్టేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News