: దీపావళి కానుక ఎలా ఉండాలంటే... ప్రధాని సలహా ఇది!
మరో వారంలో రానున్న దీపావళి, అంతకన్నా ముందు బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన ధన త్రయోదశి పర్వదినాల సందర్భంగా ఆత్మీయులకు, స్నేహితులకు పంపే కానుకలు ఎలా ఉండాలన్న విషయమై ప్రధాని మోదీ భారత ప్రజలకు ఓ సలహా ఇచ్చారు. నేడు కేంద్రం ప్రవేశపెట్టిన బంగారం బాండ్లను అయినవారికి కానుకగా అందించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా తోబుట్టువులకు, జీవిత భాగస్వాములకు పురుషులు బంగారం బాండ్లను కొని బహుమతిగా ఇస్తే, వారిని మరింత సంతోషపెట్టిన వారవుతారని ఆయన అన్నారు. భారతీయులందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్టు మోదీ వివరించారు.