: భారత బౌలర్ల యాక్షన్ ను తప్పుబట్టిన పాక్ క్రికెటర్ పై పీసీబీ సీరియస్
అనుమానిత బౌలింగ్ శైలిపై ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీమిండియా బౌలర్లు హర్భజన్, అశ్విన్ ల బౌలింగ్ యాక్షన్ లో లోపాలున్నా ఐసీసీ పట్టించుకోవడం లేదని అజ్మల్ ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కన్నెర్ర చేసింది. అజ్మల్ వ్యాఖ్యలపై న్యాయనిపుణులతో పరిశీలన జరుపుతామని చెప్పింది. 48 గంటల్లో సయీద్ కు నోటీసులు జారీ చేస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. బీసీసీఐతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలనుకుంటున్న పీసీబీకి అజ్మల్ వ్యాఖ్యలు ఆటంకంగా పరిణమించాయి.