: బాంబు దాడి వల్లే రష్యా విమానం కూలింది: అమెరికా, యూరప్ భద్రతా దళాలు


గతవారం కూలిన రష్యా విమానం ఎయిర్ బస్ 321 బాంబు దాడి కారణంగానే కూలిపోయి ఉంటుందని అమెరికా, యూరోపియన్ భద్రతా దళాలు చెబుతున్నాయి. సాంకేతిక లోపం కారణంగానే విమానం ప్రమాదానికి గురై ఉండొచ్చన్న కోణంలో మొదట దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పుడు రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. విమానం బ్లాక్ బాక్స్ కొంతభాగం ధ్వంసం కావడంతో విమానం దాడికి గురై ఉండొచ్చని అధికారులు నిర్ధారణకు వస్తున్నారు. ఈజిప్టులోని సినాయ్ లో కూలిన ఆ విమానం ఘటనలో 224 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే తామే కూల్చేశామని ఐఎస్ఎస్ ప్రకటించినా రష్యా, ఈజిప్టు అధికారులు కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News